Saturday, September 30, 2023

శివరాజ్ కుమార్ తాజా మూవీ ఘోస్ట్.. పోస్టర్ రిలీజ్

ఘోస్ట్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ అయింది.ఈ చిత్రంలో హీరోగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. శ్రీని దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ స్టన్నింగ్ లుక్ విడుదల చేశారు. సందేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది.ఘోస్ట్‌ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. శివరాజ్‌కుమార్ టీం భారీ స్థాయిలో ప్లాన్ చేసిన సెకండ్ షెడ్యూల్ డిసెంబర్‌ లో మొదలుకానుంది. శివరాజ్‌కుమార్ ఇంటెన్స్ లుక్‌తో పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. శివరాజ్‌కుమార్‌ తెలుగులో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌ పోషించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement