Friday, March 29, 2024

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ యూ-టర్న్ తీసుకొని స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. దేశీయ ఫార్మా, ఆటో ఇండస్ట్రీ షేర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 66.23 పాయింట్లు (0.13%) క్షీణించి 52586.84 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15.50 పాయింట్లు(0.10%) నష్టపోయి 15763 వద్ద ఉంది. నేడు సుమారు 1808 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1352 షేర్లు క్షీణించాయి, 126 షేర్లు మారలేదు.‎ నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద ఉంది.‎

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (10.06%), టెక్ మహీంద్రా (7.24%), బజాజ్ ఆటో (2.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.18%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.77%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.28%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.16%), టాటా స్టీల్ (-1.73%), ఏసియన్ పెయింట్స్ (-1.29%).

ఇది కూడా చదవండి: దళితబంధు పథకంపై హై కోర్టులో పిటిషన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement