Thursday, April 18, 2024

పెళ్లి పీటలు ఎక్కనున్న శార్దూల్‌ ఠాకూర్‌..

కేఎల్‌ రాహుల్‌ , అక్షర్‌ పటేల్‌ తర్వాత ఇప్పుడు మరో టీమిండియా క్రికెటర్‌ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తన ప్రేయసి మిట్టాలీ పరూల్కర్‌తో శార్ధూల్‌ ఠాకూర్‌ పెళ్లికి సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 27న వివాహం జరుగనుంది. ఈ క్రమంలో హల్ది వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మోడల్‌ మిట్టాలీ పరూల్కర్‌తో శార్దూల్‌ ఠాకూర్‌ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. వీళ్లిద్దరికీ ఏడాదిన్నర క్రితమే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల వివాహం వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఫిబ్రవరి 27న ముహూర్తం కుదిరింది. ముందుగా గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుందామని శార్దూల్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ అది క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో ముంబై సమీపంలోనే శార్ధూల్‌, మిథాలీ పెళ్లి జరగబోతోంది. ఈ వేడుకకు 200 నుంచి 250 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు. శార్దూల్‌, మిథాలీ పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. హల్ది, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement