Sunday, January 23, 2022

పిల్లలు పుట్ట‌లేదని అత్తారింట్లో అవ‌మానం.. పెళ్ల‌యిన ప‌ది నెల‌ల‌కే మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

తిరువ‌నంత‌పురం: పెళ్ల‌యి ప‌ది నెల‌లైంది. ఇంకా గ‌ర్భం దాల్చ‌లేదేమంటూ అత్తారింట్లో ఇటు భ‌ర్త‌, అటు అత్తామామ‌లు సూటిపోటి మాట‌ల‌తో వేధించారు. మూడు పూట‌లా మెక్కుతూ లావెక్కుతున్నావ్… అంటూ వేధించారు. మాన‌సిక వేధింపులే కాకుండా భౌతికంగా కూడా దాడి చేసేవారు. ఇవ‌న్నీ రోజురోజుకు ఎక్కువ‌య్యాయి. ఇక త‌ట్టుకోలేక మ‌హిళ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రం పాల‌క్క‌డ్ జిల్లా మంకారా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. లావు త‌గ్గ‌డానికి నిత్యం వాకింగ్‌, ఎక్స‌ర్ సైజులు చేస్తున్నా ఫ‌లితం లేక‌పోవ‌డంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఆ లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు పోస్టుమార్టం నివేదిక‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తేలింది. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌పై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News