Monday, March 25, 2024

లైంగిక వేధింపులు.. మంత్రి సందీప్ సింగ్ పై కేసు న‌మోదు

లైంగిక వేధింపుల‌కేసులో చిక్కుకున్నారు హ‌ర్యానా క్రీడ‌ల మంత్రి సందీప్ సింగ్. ఈ మేర‌కు ఆయ‌న‌పై చండీగ‌డ్ పోలీసులు కేసున‌మోదు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా కలవాలని పిలిచి, తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని మంత్రిపై మహిళా కోచ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేబినెట్ నుంచి వెంటనే సందీప్ సింగ్ ను తొలగించి, విచారణకు ఆదేశించాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్ డీ) పార్టీ ఆఫీసులో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలు నిరాధారమని మంత్రి సందీప్ సింగ్ కొట్టిపారేశారు. మహిళా కోచ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందిస్తూ.. కోచ్ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓ జిమ్ లో చూసి, ఇన్ స్టాగ్రాంలో మంత్రి తనను కాంటాక్ట్ అయ్యారని చెప్పారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా వచ్చి కలవాలని పిలవడంతో.. మంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ సందీప్ సింగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, సర్టిఫికెట్ కావాలంటే తను చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement