Monday, December 2, 2024

Kolkata | ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి.. సూపరింటెండెంట్ పై వేటు

కోల్‌కతాలో ట్రైనీ డాక్ట‌ర్ పై అత్యాచారం, హ‌త్య‌ చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పోలీసుల విచారణలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. నిందితుడి దుష్ప్రవర్తన ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతడిని విడిచిపెట్టారని పేర్కొన్నారు. నాలుగో భార్య క్యాన్సర్‌తో మరణించినట్లు పేర్కొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ తొలగింపు

మరోవైపు ఈ దారుణం జరిగిన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆదివారం విధుల నుంచి తొలగించింది. సుదీర్ఘకాలంగా ఆసుపత్రి సుపరింటెంట్‌గా పనిచేస్తున్న డా. సంజయ్ వశిష్టను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ డీన్‌ బుల్బుల్ ముఖోపాధ్యాయ్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది.

పోస్టుమార్టంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు…

‘‘ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో బాధితురాలి శరీరంపై పలు గాయాలు ఉన్నాయని, ఆమెపై తీవ్ర దాడి జరిగిందని తేల్చారు. ఆమె కళ్లు, నోటి నుంచి రక్తం కారింది.. ముఖం, గోళ్లపై గాయాలున్నాయి. ప్రాథమిక నివేదికలో మర్మాంగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకోలేదని ప్రాథమిక నివేదికలో తేలింది.

- Advertisement -

‘‘ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు. లైంగిక వేధింపుల తర్వాతే హత్య జరిగినట్లు పోలీసు అధికారి తేల్చారు. ఆమె మెడ ఎముకలు కూడా చాలా చోట్ల విరిగిపోయాయి. బాధితురాలు గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేసి ఉండొచ్చని మరో పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement