Tuesday, December 10, 2024

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం – ఏడుగురు ఇంజ‌నీరింగ్ విద్యార్ధుల దుర్మ‌ర‌ణం

గువాహటి: అస్సాంలో నేడు జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజ‌నీరింగ్ విద్యా ర్ధులు దుర్మ‌రణం చెందారు. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారు.. వ్యాను ఢీకొన్నాయి.. సోమవారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గువాహటిలోని అస్సాం ఇంజినీరింగ్‌ కాలేజీ లో మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు నిన్న అర్ధరాత్రి దాటాక కాలేజీ ప్రాంగణం నుంచి కారులో బయల్దేరారు. ఈ తెల్లవారుజామున జలూక్‌బరీ ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న పికప్‌ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అటు పికప్‌ వ్యాన్‌లో ఉన్న మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.
క్షతగాత్రులను గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement