Friday, March 29, 2024

హ‌ర్యానాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురికి గాయాలు..

హ‌ర్యానాలో ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుంది. రోడ్లు క‌నిపించ‌క వాహ‌న‌దారులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. సోమ‌వారం యమునా నగర్‌లో అంబాలా-యమునానగర్‌-సహరన్‌పూర్‌ జాతీయ రహదారిపై ఒకదానికొక్కటి సుమారు 15 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌కు ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకోవ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. రోడ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతోనే వాహ‌నాలు ఒక‌దానికి మ‌రొక‌టి ఢీకొన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement