Sunday, May 28, 2023

బాత్ రూంలో కాలు జారి.. సీనియ‌ర్ న‌టి భ‌ర్త మృతి

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి నీలు కోహ్లి భ‌ర్త హ‌ర్మంద‌ర్ సింగ్ క‌న్నుమూశారు. బాత్ రూంలో జారి ప‌డ‌టంతో ఆయ‌న మ‌ర‌ణించారు.అయితే ఆయ‌న‌కి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని సన్నిహితులు తెలిపారు. కానీ ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని వెల్లడించారు. నీలు నెల రోజుల క్రితమే హర్మిందర్‌ సింగ్‌ బర్త్‌డేను ఘనంగా సెలబ్రెట్‌ చేసింది. ఇంతలోనే ఇలా జరగడంతో నీలు కోహ్లి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1999లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘దిల్ క్యా కరే’తో సినీ కెరీర్ ప్రారంభించిన నీలు కోహ్లి ‘ఫక్రే రిటర్న్స్’, ‘బాస్’, ‘గుడ్ బై’, ‘జోగి’, ‘హౌస్ ఫుల్ 2’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ‘చోటీ స‌ర్దార్నీ’, ‘మ‌ధుబాలా’ మొద‌లైన సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప‌లువురు సెల‌బ్రిటీలు న‌టికి అండ‌గా నిలిచారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement