Thursday, March 28, 2024

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ – ల‌గ్జ‌రీ కార‌వ్యాన్

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ..ప్ర‌స్తుతం ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. న‌రేష్ కోసం డైరెక్ట‌ర్స్ బ‌ల‌మైన‌, ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను రూపొందిస్తుంటారు. కాగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌రేష్ అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ ని తీసుకుంటాడు. 90వ దశకంలో నరేష్ ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. జంబలకడి పంబ, ఆమె లాంటి మెమొరబుల్ హిట్స్ నరేష్ ఖాతాలో ఉన్నాయి. నరేష్ చివరగా హీరో, మ్యాస్ట్రో, టాక్ జగదీష్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో నిర్మాతలు అరేంజ్ చేసే కారవ్యాన్ లు ఉపయోగించడం మంచిది కాదని నరేష్ భావించారట‌.

అందుకే సొంతంగా ఓ లగ్జరీ కారవ్యాన్ ని నరేష్ కొనుగోలు చేశారు. తాను కోరుకున్న విధంగా ప్రత్యేకమైన కారవ్యాన్ ని నరేష్ ముంబై నుంచి కొనుగోలు చేశారట. నరేష్ కారవ్యాన్ లో ఏసీ బెడ్ రూమ్, ప్రత్యేకమైన జిమ్ ప్లేస్, వాష్ రూమ్, మేకప్ రూమ్ ఉన్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే లగ్జరీ కారవ్యాన్ లు ఉంటాయి. అలాంటిది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న నరేష్ కారవ్యాన్ కొనుగోలు చేశాడంటే అతడి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నరేష్ కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement