Sunday, March 26, 2023

‘మా’ బరిలో మరో సీనియర్ నటుడు

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇప్పటి వరకు నలుగురు పోటీలో ఉండగా.. తాజాగా ఈ నెంబర్ ఐదుకి పెరిగింది. ‘మా’ బరిలోకి మరో సీనియర్ నటుడు ఇంటర్ అయ్యారు. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. తన ప్యానల్‌ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. ‘మా ‘ సభ్యుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. కాగా, ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీలో ఉండాగా నరసింహారావు ఎంట్రీతో మొత్తం ఐదుగురు మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement