Saturday, October 12, 2024

యాపిల్‌ యూజర్లకు భద్రతాపరమైన అలర్ట్‌

యాపిల్‌ యూజర్లకు కేంద్రప్రభుత్వం భద్రతాపరమైన అలర్ట్‌లను జారీ చేసింది. ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పాటు సఫారీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

దీని వల్ల హ్యాకర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల సమాచారం సేకరించే అవకాశం ఉందని హెచ్చరించింది. యాపిల్‌ డివైజ్‌లలోని సెక్యూరిటీ, వెబ్‌కిట్‌ కాంపోనెంట్‌లలో లోపాలు ఉన్నాయి. వీటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది.

- Advertisement -

యూజర్లకు మాల్‌వేర్‌ లింక్స్‌, మెసేజ్‌లను పంపి డేటా తస్కరించే ప్రమాదం ఉంది. మ్యాక్‌ ఓఎస్‌ వెర్షన్‌ 12.7, 13.6, వాచ్‌ ఓఎస్‌-9.6.3, 10.0.1, ఐఓఎస్‌ వెర్షన్‌ -17.0.1, ఐపాడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ -17.0.1 ఓఎస్‌లలో లోపాలు ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. వాటితోపాటు సఫారీ 16.6.1 వెర్షన్‌లో కూడా లోపం ఉంది.

యూజర్లు తమ డేటాను సురక్షితంగా ఉంచేందుకు డివైజ్‌లలో లేటెస్ట్‌ వెర్షన్‌ ఓఎస్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అయితే, ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఓఎస్‌గా ఐఓఎస్‌ 17.0.1 అందుబాటులో ఉంది. కానీ, సెర్ట్‌-ఇన్‌ పేర్కొన్న జాబితాలో ఇది కూడా ఉండటంతో, యాపిల్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేస్తుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement