Sunday, February 5, 2023

దాస్ కా ధ‌మ్కీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ “దాస్ కా ధమ్కీ” సినిమాతో అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ వ‌చ్చే నెల (ఫిబ్రవరి) 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న ఈ మూవీ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు మేక‌ర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ “పడిపోయిందే పిల్ల” సాంగ్ తో అందరినీ ఆక‌ట్టుకుంది. నిన్న సెకండ్ సింగిల్ “మావ బ్రో” అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయ‌గా.. ఇవ్వాల ఫుల్ లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.

- Advertisement -
   

లియోన్ జేమ్స్ ఈ పాటకు పెప్పీ సంగీతాన్ని అందించగా, మ‌రో సారి రామ్ మిరియాలా తన గాత్రంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కాసరల శ్యామ్ రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటలో డ్యాన్స్‌లలో విశ్వక్ సేన్ ఆకట్టుకునేలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement