Thursday, April 25, 2024

రేటింగ్‌ ఏజెన్సీలకు సెబీ మార్గదర్శకాలు.. వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు

క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల (సిఆర్‌ఎ) కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 1, 2023 నుండి అమల్లోకి వచ్చే, ఈ ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా పారదర్శకతను పెంచడం, రేటింగ్‌ ప్రక్రియను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బుధవారం నాటి సర్క్యులర్‌ లో సెబి పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, సీఆర్‌ఎలు స్పష్టమైన క్రెడిట్‌ మెరుగుదల సాధనాల రేటింగ్‌కు ‘సిఇ’ (క్రెడిట్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌) ప్రత్యయాన్ని కేటాయించవచ్చు.

పెట్టుబడిదారులు థర్డ్‌ పార్టీ లేదా పేరెంట్‌ లేదా గ్రూప్‌ కంపెనీ అందించిన క్రెడిట్‌ పెంపుదల పరిధిని అర్థం చేసుకోవడానికి, రెగ్యులేటర్‌ పరిగణనలను అర్థం చేసుకోవడానికి, షేర్ల తాకట్టు, కంఫర్ట్‌ లెటర్‌తో సహా రుణాన్ని అందించడానికి ఈ ఫ్రేమ్‌వర్‌ ్క ఉపయోగపడుతుంది. క్రెడిట్‌ రేటింగ్‌లను కేటాయించేటప్పుడు, సిఆర్‌ఎలు స్వతంత్ర శ్రద్ధ వ#హంచాలి. ఖచ్చితమైన అంతర్గత వీక్షణను ఏర్పరచుకోవాలని సెబీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement