Thursday, April 18, 2024

SDT 15.. టైటిల్ గ్లింప్స్ కి వాయిస్ ఇచ్చిన స్టార్ హీరో ఎన్టీఆర్

కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్న చిత్రం SDT 15. ఈ మూవీ నుండి టైటిల్ గ్లింప్స్ వీడియోని డిసెంబ‌ర్7న ఉద‌యం 11గంల‌కు లాంఛ్ చేయ‌నున్నారు.ఈ మేర‌కు వీడియోని రిలీజ్ చేశారు. కాగా ఈ టైటిల్ గ్లింప్స్ వీడియోకు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. SDT 15 కోసం వాయిస్ అందించిన తారక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేకర్స్ విడుదల చేసిన వీడియో ఇపుడు నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. కాంతార ఫేం మ్యూజిక్ డైరెక్టర్ అంజ‌నీశ్ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు‌.ఈ చిత్రంలో హీరోగా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌గా .. మలయాళ భామ సంయుక్తా మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. SDT 15లో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరాక్ పార్టీ త‌ర్వాత అంజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న రెండో సినిమా ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement