Thursday, April 25, 2024

స్కూళ్లు తెరువాలా వద్దా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి: కేంద్రం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో విద్యాసంస్థలు ప్రారంభం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది పెద్దల్లో ఇప్పటి వరకు కేవలం పది శాతం మంది మాత్రమే కరోనా టీకా పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు స్కూళ్ల టీచర్ల టీకా శాతం, పరిస్థితిపై సీబీఎస్‌ఈ, యూజీపీతోపాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. అయితే పిల్లలు వ్యాప్తి కారకులుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులను ప్రయార్టీ గ్రూప్‌ కిందకు చేర్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయడం రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి : పేటీఎం లో 20 వేల ఉద్యోగాలు.. 35 వేల జీతం..

Advertisement

తాజా వార్తలు

Advertisement