Wednesday, April 17, 2024

ఎస్బీఐ సూపర్ సేవింగ్ డేస్ సేల్.. 50 శాతం తగ్గింపు!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్ జూలై 4న ప్రారంభమైంది. ఈ సేవల్ జూలై 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా టైటన్‌ పేపై 20 శాతం తగ్గింపు లభిస్తోంది. అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈజీమైట్రిప్‌, ఓయోపై భారీ తగ్గింపు అందిస్తోంది. అయితే, ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement