Thursday, April 25, 2024

ఎఫ్‌డీ వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ..

అగ్రగామి ప్రభుత్వ బ్యాంక్‌ స్టేబ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. 2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. పెంచిన వడ్డీరేట్లు ఈ నెల 15 వతేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 2 కోట్లలోపు అన్ని కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్‌ సిటిజన్లు చేసే నగదు జమలపై కూడా 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేటు పెంచింది. తాజా పెంపుదలతో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు 3 శాతం నుంచి 5.85 శాతం వరకు ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్ల జమలపై వడ్డీరేటును 3.5 శాతం నుంచి 6.65 శాతం వరకు ఉన్నాయి.

ఏడు రోజుల నుంచి 45 రోజల వ్యవధిలో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని 2.9 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 3.9 నంచి 4 శాతానికి, 180 నుంచి 210 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4.55 నుంచి 4.65 శాతానికి, 211 రోజుల నుంచి సంవత్సరంలోపు వాటికి 4.6 శాతం నుంచి 4.7 శాతానికి, 1 నుంచి 2 సంవత్సరాలలోపు 5.45 నుంచి 5.6 శాతానికి, 2-3 సంవత్సరాలలోపు వాటికి 5.5 నుంచి 5.65 శాతానికి, 3-5 సంవత్సరాల లోపు 5.6 నుంచి 5.8 వరకు, 5-10 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.65 నుంచి 5.85 శాతం వరకు వడ్డీరేట్లను ఎస్‌బీఐ పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement