Friday, March 29, 2024

ఎస్‌బీఐ హోంలోన్‌ రికార్డ్‌

హోంలోన్‌ బిజినెస్‌ రూ.5 ట్రిలియన్‌లు దాటినట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. గత 9 నెలల కాలంలోనే సుమారు రూ.1 ట్రిలియన్‌ మంజూరు చేసినట్టు తెలిపింది. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితులున్నా.. కేవలం హైదరాబాద్‌ సర్కిల్‌లోనే రూ.10,000 కోట్ల హోంలోన్‌ మంజూరు చేయడం జరిగిందని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ తెలిపారు. హైదరాబాద్‌ సర్కిల్‌ రూ.44,580 కోట్ల హోంలోన్‌ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నది. 19,000 గృహాలకు రూ.8,500 కోట్లు, 9100 టాప్‌ అప్‌ కింద రూ.1700 కోట్లు మంజూరు చేశాం. గృహ రుణాల కోసం పలుచోట్ల యోనో, ఆన్‌లైన్‌ కస్టమర్‌ అక్విజిషన్‌ సిస్టమ్‌ సదుపాయాలు కల్పించాం.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కోసం బ్యాంక్‌ నోడల్‌ ఏజెన్సీగా నియమించబడింది. అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నది. 3ఏళ్లలో పీఎంఏవై కింద సుమారు 16000 రుణాలు ఇచ్చాం. రూ.373 కోట్ల సబ్సిడీ అందజేశాం. 26, 27వ తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ హాల్‌లో మెగా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయనున్నాం. ప్రతీ ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలన్నదే ఎస్‌బీఐ లక్ష్యంగా సీజీఎం అమిత్‌ చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement