Thursday, April 18, 2024

పఠాన్ చిత్రాన్ని చూశా.. సారా టెండూల్కర్

స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారై సారా టెండూల్కర్ రీసెంట్ గా పఠాన్ చిత్రాన్ని చూసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అండన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి ‘పఠాన్’ సినిమాను చూస్తున్న చిత్రాన్ని ఆమె షేర్ చేసింది.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొణే జంటగా నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. . రెండు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లను వసూలు చేసింది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక చతికిల పడిన బాలీవుడ్ కు ఈ చిత్రం ఊపిరి పోసింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement