Friday, March 29, 2024

స‌త్య‌దేవ్ 26వ మూవీ.. జీబ్రా టైటిల్ ఫిక్స్

డిఫ‌రెంట్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు హీరో స‌త్య‌దేవ్.. హీరోగానే కాదు..విల‌న్..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారారు. కాగా హీరో స‌త్య‌దేవ్ 26వ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి మేకర్స్ “జీబ్రా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఓ ఆసక్తికర పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. దీందా ఈ సినిమా ఓ సాలిడ్ థ్రిల్లర్ లా అయితే అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించనుంది.. కేజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement