Thursday, April 25, 2024

లవ్‌స్టోరీ మూవీ నుంచి ‘సారంగదరియా’ వీడియో సాంగ్ వచ్చేసింది

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా నుంచి సారంగదరియా వీడియో సాంగ్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్‌కు, మంగ్లీ వాయిస్‌కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఆడియో సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేషమైన ఆదరణ దక్కింది. ఇప్పటివరకు 340 మిలియన్ వ్యూస్‌ను ఈ పాట దక్కించుకుంది. ఈ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో మంచి కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా నిలిచిపోయింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement