Friday, March 29, 2024

రేపటినుంచే విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపటినుంచి (శుక్రవారం) విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాలేజీలకు 3 రోజులు సెలవులను ఇస్తే, పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులను ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు రేపటినుంచి(శుక్రవారం) 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ కాలేజీలకు శుక్రవారం నుంచి ఈనెల 15వ తేదీద వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. 16న మళ్లి కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement