Thursday, April 25, 2024

సంక్రాంతి సంబురాలు.. ప‌తంగుల‌తో జ‌ర భద్రం..

ప్రతి పండగను భక్తి శ్రద్దలతో ఆనందోత్సవాలతో జరుపుకోవడం మన అనావాయితీ. అన్ని పండగల మాదిరిగానే సంక్రాంతి పండగ సమయంలో చిన్నా, పెద్ద అందరు కలిసి పతంగులు ఎగరవేయడం అనవాయితీగా వస్తుంది. పతంగులను సురక్షితమైన ప్రాంతాలలో ఎగురవేయడం శ్రేయస్కారం. పతంగులను విద్యుత్‌ లైన్లకు దగ్గరగా, ట్రాన్స్‌ఫార్మర్లకు వద్ద ఎగురవేసినట్లయితే పతంగులకు ఉన్న మాంజా దారం విద్యుత్‌ లైన్లపై ట్రాన్స్‌ఫార్మర్లపై పడినట్లయితే ప్రమాదాలు సంభ వించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పతంగులు ఎగురవేసే సమయంలో చిన్నా, పెద్ద అందరు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో పిల్లలు పతంగులను ఎగుర వేసే సమయంలో జాగ్రత్తలు పాటించి పిల్లులు, పెద్దలు అందరు పండగను సంతోషంగా నిర్వహించుకోవాలని సీఎండీ పిలుపు నిచ్చారు. నగరంలో బస్తీలలో పిల్లలు పతంగులు ఎక్కువగా ఎగురవేస్తుంటారని, ఇక్కడే ఎక్కువగా తెగిన పతంగులు విద్యుత్‌ తీగల్లో చెక్కుబడతాయని, వాటిని తీయడానికి ఇనుపరాడ్లు, పచ్చి కర్రలతో ప్రయత్నించడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

SPDCL CMD G. Raghumareddy

విద్యుత్‌ లైన్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా పతంగులు ఎగురవేయాలని సూచించారు. కాటన్‌, నైలాన్‌, లిసెన్‌తో చేసిన మాంజాను మాత్రమే వాడాలని, మెటాలిక్‌ మాంజాలు వాడడం వల్ల అవి విద్యుత్‌ వైర్లపై పడినప్పుడు విద్యుత్‌ షాక్‌ కలిగే అవకాశం ఉం టుందని తెలిపారు. పొడి వాతావరణం ఉంటేనే పతంగులు ఎగుర వేయాలని, తడి వాతావరణంలో పతంగులు ఎగురవేయడం వల్ల విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎండీ తెలిపారు. గాలి పటాల దారాలు (మంజా, తార్‌ ) విద్యుత్‌ తీగలలో చిక్కుకుపోయి వాటి ద్వార విద్యుత్‌ సరఫరా అంతరాయానికి దారితీస్తుంటాయని, దీని వల్ల సాధారణ రోజుల కంటే సంక్రాంతి పండగ సెలవుల్లోనగరంలో ఎక్కవ విద్యుత్‌ అంతరాయాలు వచ్చే అవకాశాలుఉంటాయని, దీనికి పతంగులు కారణమని గుర్తించాలని ఆయన సూచించారు. మంజాలు విద్యుత్‌ తీగల్లో చిక్కుకోవడం వల్ల వర్షాకాలం తొలకరి సమయంలో ఎక్కువ బ్రేక్‌ డౌన్‌లు వస్తుంటాయని అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి : ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.. విద్యుత్‌ రంగంలో ఇంజనీర్ల కృషి మరవలేనిది..

చెరువులు ,కుంటలు నాలాల దగ్గరలో పతంగులు ఎగురవేయడం ప్రమాదకరమని, నగరంలో మూసీ నది వెంట ఉన్న హై టెన్షన్‌ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డాబాలపైన, విద్యుత్‌లైన్ల కింద పతంగులు ఎగుర వేసే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్‌కు సంబంధించిన అంతరాయం ఉన్నా, ప్రమాదం జరిగినా 1912 నెంబర్‌కు డయల్‌ చేయాలని లేదా ప్రాంతీయ విద్యుత్‌అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండాలని , సువిశాలమైన ప్రాంతంలో మాత్రమే పతంగులు ఎగుర వేయడం శ్రేయస్కారం అని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పేర్కోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement