Wednesday, March 29, 2023

ప‌ల్లెబాట‌లో ప‌ట్నం… టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహ‌నాల రద్దీ..

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఎక్క‌డ ఉన్నా సంక్రాంతి పండుగ‌కు కుటుంబ స‌మేతంగా తొంతూళ్ల‌కు వ‌స్తుంటారు. ప‌ల్లెల్లో కుంటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా పండుగ‌ జ‌రుపుకుంటారు. ప‌ట్నం వాసులు ప‌ల్లెబాట ప‌ట్ట‌డంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈ నేపథ్యంలో న‌ల్ల‌గొండ జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా, కృష్ణా జిల్లా ఉంగుటూర్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వాహ‌న‌దారులు కొంత‌మేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు చేప‌ట్టారు. టోల్ బూత్‎లలో వీలైనంత వ‌ర‌కు త్వ‌ర‌గా వాహ‌నాల‌ను రిలీజ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ర‌హ‌దారిపై యాక్సిడెంట్ స్పాట్లు గుర్తించి భారీ కేట్లు ఏర్పాటు చేశారు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. పంతంగితోపాటు కొర్లపాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement