Thursday, April 25, 2024

సంక్రాంతి బ‌రిలో బాల‌కృష్ణ‌.. జ‌న‌వ‌రి 12న వీర‌సింహారెడ్డి

సంక్రాంతి బ‌రిలో నిలిచారు హీరో బాల‌కృష్ణ‌. ఆయ‌న తాజా చిత్రం వీర సింహా రెడ్డి. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ న‌టిస్తోంది. అయితే… చిత్రీకరణ అనుకున్న విధంగా కంప్లీట్ కాక‌పోవ‌డంతో సంక్రాంతికి వెళ్ళారు. ఈ సినిమా విడుదల తేదీ వెల్లడించారు. జనవరి 12న వీర సింహా రెడ్డి చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. ముందు నుంచి ఈ తేదీకి సినిమా వస్తుందనేది తెలిసిందే. కాకపోతే శ‌నివారం అధికారికంగా వెల్లడించారు. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో వీర సింహా రెడ్డి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement