Friday, December 6, 2024

Kerala | రైలు ఢీకొని పారిశుధ్య కార్మికులు మృతి !

కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలక్కాడ్ జిల్లా షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. షోరనూర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చెత్తను తొలగిస్తుండగా కేరళ ఎక్స్‌ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

అయితే, ఘటనా స్థలంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నాలుగో మృతదేహం భరత పూజ నదిలో పడినట్లు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయ‌ని షోరనూర్ రైల్వే పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement