Saturday, April 20, 2024

ఆసియా ఓపెన్‌ డబుల్స్‌ నుంచి సానియా జోడి ఔట్

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి సానియా- అనా డానిలీనా జోడి నిష్క్రమించింది. దీంతో మిక్స్‌డ్‌ డబుల్స్‌పై ఆశలు పెట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండో- కజఖ్‌ జోడి బెల్జియంకు చెందిన అలిసన్‌ వాన్‌ యూట్వాంక్‌ , ఉక్రెయిన్‌కు చెందిన అన్‌హెలినా చేతిలో 4-6, 6-4, 2-6తో ఓటమిపాలైంది. దీంతో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ ఆశలు ఆవిరయ్యాయి. సానియా జోడి టైటిల్‌ నెగ్గడం కాస్తా కష్టంగానే కనిపిస్తుంది. సానియా – బోపన్న జోడి శనివారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో సానియా మిర్జా- రోహన్‌ బోపన్న జోడి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.


రియో 2016 సెమీ ఫైనలిస్టులు సానియా మిర్జా- రోహన్‌ బోపన్న 1.14 గంటల్లో 7-5, 6-3 స్కోరుతో ఆస్ట్రేలియా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు జామీ ఫోర్లిస్‌- ల్యూక్‌ సవిల్లె జోడిని ఓడించింది. ఇదిలా ఉండగా సానియా త్వరలో టెన్నిస్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే ఇది ఆఖరి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అని, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ఇటీవల విడుదల చేసిన నోట్‌లో తెలిపింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించిన సానియా తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement