Saturday, October 5, 2024

Sangareddy – ఎఫ్ టి ఎల్ పరిధిలోని నిర్మాణాలు కూల్చివేత

సంగారెడ్డి, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్): కొండాపూర్ మండలం కుతుబ్ షాయిపేట్ గ్రామ శివారులో 93 సర్వేనంబర్ లో ఉన్న ఈ చెరువు మూడు ఎకరాల ఎఫ్ టీఎల్ భూమిని ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. పూర్తిగా ఎఫ్ టీఎల్ లోనే భవనాలు నిర్మించడమే కాకుండా అందులో స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ హౌజ్ నిర్మించారు.

- Advertisement -

మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణంలోని సర్వే నంబర్ 93లో ఎఫ్‌టీఎల్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎఫ్ టీఎల్ లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం చుట్టూ పెద్ద ఎత్తున నీరు చేరింది. పత్రికల్లో వరుస కథనాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమై అధికారులు గురువారం ఉదయం అట్టి నిర్మాణాలను నేలమట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement