Friday, March 29, 2024

మెటా ఇండియా చీఫ్‌గా సంధ్యా దేవనాథన్‌

మెటా ఫ్లాట్‌ఫారమ్‌ ఇండియా చీఫ్‌గా సంధ్యా దేవనాథన్‌ నియమితులయ్యారు. నిన్నటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న అజిత్‌ మోహన్‌ స్నాప్‌ ఇంక్‌లో చేరేందుకు సిద్ధమవడంతో ఆయన స్థానంలో ఈ నియామకం జరిగింది. వాట్సాప్‌ ఇండియా చీఫ్‌ అభిజిత్‌ బోస్‌, భారతదేశంలోని మెటా ఫ్లాట్‌ఫారమ్‌ల పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ కూడా ఈ వారం ప్రారంభంలో రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం బిగ్‌టెక్‌ కంపెనీలను నియంత్రించే చట్టాలను కఠినతరం చేయడంతో ఫేస్‌బుక్‌ సంస్థ ఇండియాలో నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంటున్నది.

ఈ తరుణంలో సంధ్యా దేవనాథన్‌ నియామకం జరిగింది. భారతదేశంలో ఫేస్‌ న్యూస్‌తోపాటు ద్వేషపూరిత ప్రసంగాలవ్యాప్తిని అరికట్టడానికి కంపెనీ పెద్దగా చర్యలు చేపట్టలేదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లను దేవనాథన్‌ ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. ఈమె మెటాలో 2016నుంచి సేవలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆమె కొత్త బాధ్యతల్లోకి పూర్తిగా మారనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement