Tuesday, April 23, 2024

రేపు రాత్రి 11గంటల నుంచి 5గంటల వరకు ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు..

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల పరిథిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి 11గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరంమాల్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు బ్రిడ్జ్, బాబు జగ్జీవన్ రామ్, బేగంపేట్, ప్యారడైజ్, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీనగర్, మలక్ పేట్, నెక్లెస్ రోడ్, మెహదీపట్నం, పంజాగుట్ట ప్లైఓవర్లు మూసివేయనున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి అనుమతించనున్నారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 5గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లను అనుమతించరు. కేవలం లారీలు, గూడ్స్ వాహనాలుకు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement