Friday, April 19, 2024

శాకుంత‌లంపై స‌మంత రివ్యూ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం శాకుంత‌లం.ఈ మూవీని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ రూపొందించ‌గా ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుంది.ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను గురించి సమంత స్పందించారు. ఈ సినిమాను తాను చూశాననీ, అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుందనీ, గుణశేఖర్ తన హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారని చెప్పారు. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయమనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సినిమాకి సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేననీ, అందుకు కారణమైన దిల్ రాజుగారికీ, నీలిమ గుణ గారికి థ్యాంక్స్ చెబుతున్నానని .. ఈ సినిమా ఎప్పటికి తనకి దగ్గరగానే ఉండిపోతుందని అన్నారు. సమంత స్పందించిన తీరు ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచడం ఖాయమనే చెప్పాలి. దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement