Friday, April 19, 2024

షూటింగ్ లో స‌ల్మాన్ ఖాన్ కు గాయం ..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైంది. దాంతో వైద్యులు ఆయనకు హుటాహుటిన చికిత్స అందించారు. కాగా గాయ‌మైన విష‌యాన్ని స‌ల్మాన్ త‌న ట్విట్ట‌ర్ లో దృవీక‌రించారు.. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు సీక్వెల్ గా తాజా చిత్రం టైగర్ 3 తెరకెక్కుతుంది. సల్మాన్ ఖాన్ కి జంటగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తుంది. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement