Saturday, April 20, 2024

కిక్కే కిక్కు, మద్యం అమ్మకాల జోరు.. రెండు రోజుల్లో 170 కోట్లకు పైగానే

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ రాష్టం లో ఉమ్మడి జిల్లా పరిధిలోనే రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. చివరి రెండు రోజుల్లో ఏకంగా రూ. 170 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలోనే రూ. 106కోట్ల మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి. మద్యం తాగి రోడ్ల పైకి వచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 1314 కేసులు నమోదయ్యాయి ఇందులో 50 ఏళ్ల వారే ఎక్కువ మంది ఉన్నారు…

కొత్త సంవత్సరం నేపథ్యంలో మద్యం అమ్మకాలు రికార్డ్ సృష్టించాయి. చివరి రెండు రోజుల్లో ఔరా అనిపించేలా ఆమ్మకాలు జరిగాయి. మామూలుగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంటాయి. ఇక పండగలు…కొత్త సంవత్సరం వేడుకలకు ఇక చెప్పనక్కర లేదు. డిసెంబర్ 30..31 తేదీల్లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో ఏకంగా రూ. 170 కోట్లకు పైగానే విక్రయాలు జరిగాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్…సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో ఏకంగా రెండు రోజుల్లో రూ. 106 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రూ. 63.03 కోట్లు…31 రోజు రూ. 43.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో జిల్లాలో రూ. 847.29 కోట్ల వివువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదిలో ఇదే రికార్డ్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అత్యధిక కలెక్షన్ రంగారెడ్డి జిల్లా నుండే వస్తోంది. మొత్తం మీద కొత్త సంవత్సరం నేపథ్యంలో జోరుగా మద్యం తాగి జల్సా చేశారు….

- Advertisement -

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు…

మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మద్యం ప్రియులు అవేమీ పట్టించుకోలేదు. కొత్త సంవత్సర వేడుకల్లో తెగ తాగి రోడ్ల పైకి వచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. ఇందులో 50 ఏళ్ల వారే ఎక్కువ మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1314 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారు జాము నుండే పోలీసులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేశారు. ఇందులో బాగా తాగి అడ్డంగా దొరికిపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. 21 నుండి 30 ఏళ్ల వారు 705 మంది…31 నుండి 40 ఏళ్ళవారు 380 మంది 41 నుండి 50 వయస్సు వారు 141 మంది ఉన్నారు 60 ఏళ్ల వారు 27 మంది…61 ఏళ్లు పైబడిన వారిలో ఒకరి పై కేసు నమోదు చేశారు. 20 ఏళ్ల లోపు వాళ్ళు 59 మంది ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి రోడ్ల పైకి రాకూడదని చేపున్నా వచ్చి తగిన మూల్యం చెల్లించుకున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement