Tuesday, October 8, 2024

ముగిసిన కోల్‌ ఇండియా షేర్ల అమ్మకం.. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

కోల్‌ ఇండియాలో 3 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించి షేర్లను మార్కెట్లో విక్రయానికి పెట్టింది. రిటైల్‌, సంస్థాగత మదుపరులు వీటిని మొదటిరోజే కొనుగోలు చేశారు. షేర్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 4 వేల కోట్లు సమకూరనున్నాయి. మంచి స్పందన రావడంతో ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. రెండు రోజుల ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 18.48 కోట్ల షేర్లు విక్రయించారు. ఇది కోల్‌ ఇండియాలో 3 శాతం వాటాలకు సమానం. షేరుకు ఒక్కోదానికి 225 రూపాయలుగా ఆఫర్‌ ధర నిర్ణయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు 28.76 కోట్ల షేర్లు బిడ్డింగ్‌ వేశారు.

రిటైల్‌ ఇన్వెస్టర్లు 2.58 కోట్ల షేర్లకు బిడ్డింగ్‌ వేశారు. కోల్‌ ఇండియాలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. మిగిలింది పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ ఉంది. కేంద్రంలోని ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వరనసగా అమ్మకానికి పెడుతోంది. కొన్ని సంస్థల్లో వాటాలను విక్రయిస్తుంటే, మరికొన్ని సంస్థలను పూర్తిగా విక్రయిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా 51వేల కోట్లు సమీకరించాలన్న ప్రభుత్త టార్గెట్‌ పూర్తి చేసేందుకు కోల్‌ ఇండియా షేర్ల అమ్మకం కూడా కల్సిరానుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా తెగనమ్మడంపై ఎన్ని విమర్శలు వస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement