Thursday, April 18, 2024

ఏపీలో అర్చకులకు జీతాలు పెంపు

ఏపీలోని అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దేవాదాయ శాఖపై సీఎం జగన్‌ సోమవారం నాడు సమగ్రంగా సమీక్షించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ దేవాదాయ శాఖను సీఎంలు సమీక్షించిన దాఖలాలు లేవన్నారు. ఏపీలోని దేవాలయాల్లో వంశపారం పర్యంగా అర్చకుల నియామకం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆన్‌లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు.

దేవాదాయ శాఖ భూముల సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌కు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. దసరా నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని…ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు ఆహ్వానం అందించామని తెలిపారు. ఏపీ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement