Friday, April 19, 2024

స‌లార్ మూవీ షూటింగ్.. ఫొటోలు లీక్

ఈమ‌ధ్య‌కాలంలో ప‌లు చిత్రాల షూటింగ్ ల నుండి ఫొటోలు లీక్ అవుతున్నాయి. కాగా పాన్ ఇండియా చిత్రం స‌లార్ మూవీ షూటింగ్ నుండి ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సలార్ సినిమా ఇప్పటికే 85% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సలార్ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి కూడా లీకుల బెడ‌ద తప్పడం లేదు.

ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తాజా వైరల్ గా అవుతున్న లీక్ ఫోటోలలో ప్రభాస్ చాలా హైలైట్ గా కనిపిస్తున్నారు. దీంతో చిత్ర బృందం మరొకసారి అప్రమత్తం అయ్యేలా కనిపిస్తోంది. షూటింగ్ ఫోటోలు వీడియోలు లీక్ అవ్వడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాట ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం బొగ్గు గనుల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement