Wednesday, April 24, 2024

శాకుంత‌లం రిలీజ్ వాయిదా.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం శాకుంత‌లం.ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తోంది.కాగా ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ దిశగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ .. అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఈ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింద‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఒక పాట తరువాత ఒక పాటను రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారనే విషయం ఈ పాటల ద్వారానే అందరికీ అర్థమైపోయింది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ న‌టించాడు.. అనన్య నాగళ్ల, మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement