Friday, November 15, 2024

నిర్మల్ లో ఘనంగా సురక్ష దినోత్సవం

నిర్మల్ టౌన్ ,జూన్ 4 (ప్రభ న్యూస్ )తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీసు సురక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీడియంలో పోలీస్ పెట్రో వాహనాలు బ్లూ కోర్స్ షీ టీం ట్రాఫిక్ విభాగాలకు సంబంధించిన ప్రచార వాహనాలతో ర్యాలీని ఏర్పాటు చేశారు .ఈ ర్యాలీని రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు .ఎన్టీఆర్ స్టేడియం నుండి బస్టాండ్ మజీద్ బుధవార్ పేట్ గాంధీ చౌక్ గుల్జార్ మసీద్ జయశంకర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, నిర్మల్ డిఎస్పి జీవన్ రెడ్డి ,ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్, సిఐలు ట్రాఫిక్ ఎస్ఐలు దేవేందర్ రాజశేఖర్ ఎంటిఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement