Friday, March 29, 2024

భారత్‌ పర్యటనకు సఫారీలు.. ప్రొటీస్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌

న్యూఢిల్లి : దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ పర్యటనకు రానుంది. ప్రొటీస్‌ జట్టుతో స్వదేశంలో టీ20 సిరీస్‌ టీమిండియా ఆడుతుంది. 5 మ్యాచుల సిరీస్‌ జూన్‌ 9తో ప్రారంభం అవుతుంది. చెన్నైలో తొలి మ్యాచ్‌ ఉంటుంది. 12వ తేదీన 2వ మ్యాచ్‌ బెంగళూరులో, మూడో మ్యాచ్‌ 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో, 17న నాల్గో మ్యాచ్‌ గుజరాత్‌లో సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో, 19న చివరి టీ20 ఢిల్లిdలో ఉంటుంది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022లో సీజన్‌లో ఆడుతున్న ప్లేయర్లు సగం మంది వరకు ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడుతున్న నేపథ్యంలో భారత్‌ పిచ్‌లు, బౌలింగ్‌ తీరు, అక్కడి వాతావరణ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో క్రికెట్‌ దక్షిణాఫ్రికా బోర్డు భావిస్తున్నది. ట్రిస్టన్‌కు జట్టులో చోటు దక్కింది. ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. ప్రస్తుతం ముంబై తరఫున ఆడుతున్నాడు. మర్‌క్రమ్‌, జాన్సెన్‌, ప్రిటోరియస్‌, క్వింటన్‌ డీకాక్‌, డేవిడ్‌ మిల్లర్‌, నోర్ట్జే , కసిడో రబడా, వాన్‌డుర్‌ డుస్సెన్‌ ఈ పర్యటనకు ఎంపికయ్యారు. వీరంతా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆయా జట్లలో ఆడుతున్నారు.

టెంబా బావుమా నాయకత్వం..

ఈ జట్టుకు టెంబా బావుమా నాయకత్వం వహిస్తున్నాడు. అతని సారథ్యంలో భారత్‌ పర్యటనకు వస్తున్నది. జట్టులో డికాక్‌, హెండ్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, మర్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌; లుంగి ఎన్గిడి, నోర్ట్జే, పార్నెల్‌, ప్రిటోరియస్‌, కసిగో రబడా, తబ్రేజ్‌ శాంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, రస్సీ వ్యాన్‌ డెర్‌ డస్సెన్‌, మార్కో జాన్సెన్‌లు చోటు దక్కించుకున్నారు. వేన్‌ పార్నెల్‌ 2017 తరువాత.. మళ్లిd టీ20 జట్టులోకి స్థానం సాధించాడు. 26న భారత్‌ జట్టు ప్రకటన ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాకు తుది రూపాన్ని ఇవ్వడంపై బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ దృష్టి సారించింది. 2022 సీజన్‌ పర్‌ఫార్మెన్స్‌తో పాటు ప్లేయర్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు ఎంపిక ఉంటుంది. 23 లేదా 24 తేదీల్లో పూర్తి సమాచారం వెలువడే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement