Friday, April 26, 2024

శ‌బ‌రిమ‌ల‌లో ప్ర‌సాద విక్ర‌యాలు బంద్….

శ‌బ‌రిమ‌ల – కేర‌ళ – శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప స్వామివారి ప్ర‌సాద అమ్మ‌కాల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.. దీంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి వ‌స్తున్న భ‌క్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకో కుండానే తిరుగుపయనం అవుతున్నారు..ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్‌కోర్ ట్రస్ట్ ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి అనుమంచింది హైకోర్టు. కాగా, కోర్టు ఆదేశాలతో బుధ‌వారం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో ఇప్ప‌టికే సిద్ధంగా ఉంచిన‌ దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిపివేశారు..యాల‌కులు లేకుండా ప్ర‌సాదాల త‌యారీకి ట్రావెన్ కోర్డు శ్రీకారం చుట్టింది.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌సాదాన్ని అందుబాటులోకి తెస్తామ‌ని శ‌బ‌రిమ‌ల ఆల‌య నిర్వ‌హ‌కులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement