Thursday, March 28, 2024

తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు? దాడులు ఉధృతం.. ముందుకు కదులుతున్న సేనలు

కీవ్‌:తూర్పు ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లో నెమ్మదిగా రష్యా పట్టు సాధిస్తోంది. కొత్త ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూనే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో తన అనుకూల పాలన సాగేలా నాయకత్వాన్ని నియమిస్తోంది. పైగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రష్యా పౌరసతం పొందేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ విధానాలను ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం డిక్రీ జారీ చేయడం విశేషం. ఉక్రెయిన్‌లోని ప్రధాన పారిశ్రామిక, పోర్టుసిటీ మరియపోల్‌ను సాధీనం చేసుకున్న తరహాలోనే డోన్‌బాస్‌ ప్రాంతంలోని అనేక పట్టణాలపై రష్యా దాడులు చేస్తోంది. ప్రస్తుతం లుషాంక్‌, ఖేర్సన్‌, సీవిరోడోనెట్‌స్కీ, జపోరోరి&ురి&ుయా ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుపోతోంది. వీటిలో సీవిరో డోనెట్‌స్కీ పట్టణం అతి కీలకం. ఉక్రెయిన్‌లో డోన్‌బాస్‌ అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ సీవీరోడోనెటెస్కీ నగరం కీలకం దీనికి తూర్పున డోనెట్స్‌ నది, పశ్చిమాన లిషిచాన్‌స్క్‌ నది ఉన్నాయి. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే డోన్‌బాస్క్‌-లుషాంక్‌ రీజియన్‌ అంతా రష్యా చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే బుధవారంనాడు రష్యా దాడులు తీవ్రతరం చేసింది.

ఇక్కడ మూడువైపులనుంచి దాడులు చేస్తున్న రష్యా విద్యుత్‌, మంచినీటి సరఫరా వ్యవస్థలను దెబ్బతీసింది. పౌరులు తప్పనిసరి పరిస్థితుల్లో బంకర్లలో తలదాచుకునేలా చేస్తోంది. లేదా వలసవెళ్లే పరిస్థితిని సృష్టిస్తోంది. మరియపోల్‌, ఇతర ప్రాంతాల్లోని మబలగాలను ఇక్కడికి తరలించి ఎదురుదాడులు ఉధృతం చేసింది. మరియపోల్‌ తరహాలోనే తమను చుట్టు ముడుతోందని అక్కడి ప్రభుతం ఆందోళన చెందుతోంది. అంతమాత్రాన ఉక్రెయిన్‌ చేష్టలుడిగి చూడటం లేదు. అతి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. బుధవారంనాడు డోన్‌బాస్క్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాల్లో క్షిపణులు, రాకెట్లు, ఫిరంగులతో రష్యా సేనలు దాడులు చేశాయి. ఆరుగురు మరణించారు. పెద్దసంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేస్తూండటంతో ఇక్కడ పరిస్థితి అతి భయానకంగా ఉంది. ద్నిపోపెట్రోవాస్క్‌ ప్రాంతంలో మరింత భయంకర యుద్దం సాగుతోంది. మరోవైపు రష్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉక్రెయిన్‌ లొంగిపోదని, రష్యా పైచేయి సాధించిన ప్రాంతాలను తిరిగి సాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమకు మరింత సాయం అందించాలని బుధవారంనాడు మరోసారి పశ్చిమ దేశాలను కోరారు. తమకు ఆయుధ, సైనిక సాయం అందించే విషయంలో ఐరోపా కూటమి దేశాల మధ్య ఐక్యత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement