Thursday, April 25, 2024

రష్యా యుద్ధనేరాలపై విచారణకు ఓకే

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, దాని సమీప పట్టణాల్లో రష్యా సైనికుల యుద్ధ నేరాలపై విచారణ చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాగా తమ సైనికులు ఎటువంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదన్న రష్యా ఆ తీర్మానం చేయడం రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. కాగా రష్యా యుద్ధనేరాలకు సంబంధించి అనేక ఆధారాలున్నాయని యూఎన్‌ హ్యూమన్‌ రైట్స్‌ హైకమిషనర్‌ మిషెల్లి బఛెలెట్‌ స్పష్టం చేసారు. మరోవైపు ఉక్రెయిన్‌ తొలిసారిగా రష్యాకు చెందిన సైనికుడిని యుద్ధఖైదీగా అదుపులోకి తీసుకుంది. అతడి యుద్ధనేరాలపై శుక్రవారం విచారణ ప్రారంభించింది. రష్యా యుద్ధట్యాంక్‌లో ఉన్న ఆ 21 ఏళ్ల రష్యా సైనికుడు కీవ్‌లో సాధారణ పౌరుడిని కాల్చిచంపినట్లు ఆరోపించి ప్రత్యేక కోర్టు ఆవరణలో విచారణ చేపట్టింది. చిన్న గాజు గదిలో యుద్ధఖైదీ హాజరుకాగా పెద్దసంఖ్యలో జర్నలిస్టులు గుమిగూడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement