Friday, April 26, 2024

గ్లోబ‌ల్ సెర్చింజ‌న్ గూగుల్ కు 750 కోట్ల ఫైన్.. ఎందుకు..

గ్లోబల్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా భారీ షాకిచ్చింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా నియంత్రిత కంటెంట్‌ను డిలీట్‌ చేయని కారణంగా గూగుల్‌కు 100 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.750 కోట్లు) విధిస్తూ రష్యా తగన్‌స్కీ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఈ తీర్పు ఇచ్చింది. నిషేధిత కంటెంట్‌పై ఆంక్షలు ఉన్నప్పటికీ.. అభ్యంతరకరమైన కంటెంట్‌ను డిలీట్‌ చేయలేదు. అందుకే జరిమానా విధిస్తున్నామని కోర్ట్‌ స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై స్పందించిన గూగుల్‌.. కోర్ట్‌ ఆదేశాలను పరిశీలించనున్నామని తెలిపింది. పరిశీలన అనంతరమే తదుపరి చర్య ఉంటుందని వెల్లడించింది.

కాగా గతేడాదికాలంగా ఇంటర్నెట్‌ మీడియాపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. నార్కోటిక్స్‌, ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించింది. ఈ తరహా కంటెంట్‌ను తొలగించాలని ఇంటర్నెట్‌ మీడియాను కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement