Wednesday, July 28, 2021

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా తిరుమల పరిసరాలు మళ్లీ భక్తులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి. సోమవారం శ్రీవారిని 17,310 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం నాడు 7,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 1.89 కోట్ల ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News