Wednesday, April 17, 2024

రుచిసోయా 2925 కోట్ల రుణాలు చెల్లింపు..

బాబా రామ్‌దేవ్‌కు నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన వంటనూనెల తయారీసంస్థ రుచి సోయా రూ.2,925రుణాలు చెల్లించినట్లు తెలిపింది. రుచి సోయా ఐపీఓ ద్వారా రూ.4300 కోట్ల నిధులు సేకరించింది. ఈ మొత్తంలో రూ.1950కోట్లు రుణాల చెల్లింపునకు కేటాయిస్తామని సెబీకి తెలిపింది. అయితే షేర్ల నమోదు తర్వాత సంస్థకు ఉన్న రుణాలను పూర్తిస్తాయిలో చెల్లించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి చెల్లించినట్లు రుచిసోయా తెలిపింది. ఈ కన్సార్షియంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ ఉన్నాయి. రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ గత నెల 24న ప్రారంభమై 28న ముగిసింది.

2021 జూన్‌లో ముసాయిదా పత్రాలు దాఖలు చేయగా, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గతేడాది ఆగస్టులో ఎఫ్‌పీఓకు అనుమతి లభించింది. నమోదిత కంపెనీలో పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ కనీసం 25శాతం ఉండాలన్న సెబీ నిబంధనలు అనుసరించి పబ్లిక్‌ ఇష్యూకి వచ్చామని రుచి సోయా పేర్కొంది. ఈక్రమంలో షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. రుచి సోయా షేర్లు శుక్రవారం 12.94 శాతం లాభంతో రూ.924.85వద్ద ముగిశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement