Friday, April 26, 2024

వేసవిలో ప్రయాణికులకు ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ ఆదేశించారు. బస్టాండ్లలో తాగు నీటితో పాటు ఫ్యాన్లు, కూలర్లు, బేంచీలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎండి ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలనీ, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. రాబోయే కాలం ఆర్టీసీకి ఎంతో కీలకమనీ, ఆ మేరకు అధికారులంతా పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు.

- Advertisement -

సంస్థ ఆర్థిక పరిపుష్టికి పాటుపడాలనీ, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన విధి అనే విషయం మరచిపోవద్దన్నారు. వచ్చే నెలలో వివాహాలు, శుభ కార్యాలు ఎక్కువగా ఉంటాయనీ, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై సైతం 10 శాతం రాయితీని కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నామనీ, వీటిని సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement