Thursday, April 25, 2024

కరోనాపై అవగాహన కల్పిస్తూ ఆర్ఆర్ఆర్ టీం వీడియో..

ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్ర‌జ‌ల‌లో కరోనా పట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క‌లిసిక‌ట్టుగా ముందుకు వ‌చ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో #StandTogether పేరుతో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆలియా భట్‌ తెలుగులో.. రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. క‌రోనా జాగ్ర‌త్తలు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క పాటించాల‌ని ఎవ‌రు ఈ మ‌హ‌మ్మారిని అశ్ర‌ద్ధ చేయోద్దంటూ స్ప‌ష్టం చేశారు. మనకోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారికోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement