Friday, April 19, 2024

ఆర్ ఆర్ ఆర్ కి.. సియాటెల్ క్రిటిక్స్ పురస్కారం

ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు చేరింది. గతవారం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ సినిమా తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారం దక్కించుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ చిత్రానికి అవార్డు లభించింది.ఈ విషయాన్ని సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కొస్టాడినోవ్, నిక్ పావెల్, రియచో వసిలెవ్ యాక్షన్ స్టాంట్స్ కు కోఆర్డినేటర్లుగా పని చేశారు. ప్రేమ్ రక్షిత్, దినేశ్ క్రిష్ణన్ స్టంట్స్ కొరియాగ్రఫీ చేశారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు..ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెరకెక్కించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement