Friday, March 29, 2024

RRR: డబ్బింగ్ పూర్తి చేసిన చరణ్, తారక్..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్.. దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీ 7 జనవరి 2022 న థియేటర్‌లలోకి వస్తుందని రాజమౌళి ప్రకటించాడు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది.

ఈ కళాఖండం కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ ను పూర్తి చేశారు. మలయాళం వెర్షన్ కోసం కొన్ని చిన్న రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులు మినహా, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే దశలో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్, జీ5 సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ విడుదల తర్వాత సినిమా తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ వెర్షన్‌లు జీ5 లో అందుబాటులో ఉంటాయి. హిందీ, కొరియన్, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయి.

ఇది కూడా చదవండి: పెద్దల ఆశీర్వాదం నొకొద్దు..వారిని ప్రశ్నించే సత్తా ఉన్నవాడే గెలవాలి: ప్రకాష్ రాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement